ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయంలో (PMO) పనిచేసే డ్రైవర్లు, వంటవాళ్ల జీతాల వివరాలు వెలుగులోకి వచ్చాయి. 2023 నాటి PMO డేటా ప్రకారం, డ్రైవర్లు పే లెవల్ 5 కింద రూ.29,200 నుంచి రూ.92,300 వరకు జీతం పొందుతున్నారు. వీరి ప్రాథమిక జీతం రూ.44,100 నుంచి రూ.42,800 వరకు ఉంటుంది. అత్యంత నైపుణ్యం కలిగిన డ్రైవర్లను మాత్రమే ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. వంటవాళ్లు పే లెవల్ వన్ లో రూ.18 వేల నుంచి రూ.56,900 వరకు జీతం అందుకుంటారు, వీరి ప్రాథమిక జీతం రూ.20,300. ఇతర ఉద్యోగులు కూడా వారి హోదాను బట్టి వివిధ భత్యాలు పొందుతారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa