విజయ్ హజారే ట్రోఫీలో ఉత్తరప్రదేశ్ కెప్టెన్ రింకూ సింగ్ చండీగఢ్‌తో జరిగిన మ్యాచ్‌లో 56 బంతుల్లోనే సెంచరీ సాధించి అదరగొట్టారు. ఆర్యన్ జుయల్ (134) కూడా రాణించడంతో యూపీ 50 ఓవర్లలో 367/4 భారీ స్కోరు చేసింది. మరోవైపు, గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ (77), పంత్ (70) హాఫ్ సెంచరీలతో రాణించగా, ఢిల్లీ 254/9 స్కోరు చేసింది. ఉత్తరాఖండ్‌తో మ్యాచ్‌లో రోహిత్ శర్మ విఫలమైనప్పటికీ, హార్దిక్ తమోర్ (93) అద్భుత ప్రదర్శనతో ముంబై 331/7 స్కోరు సాధించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa