ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్‌నగర్‌లో షాకింగ్ యాక్సిడెంట్ జరిగింది. మహావీర్ చౌక్ వంతెన వద్ద అతివేగంతో వచ్చిన ఒక కారు ట్రక్కును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఓ సిగ్నల్ వద్ద భారీ ట్రక్కు రోడ్డు క్రాస్ చేస్తోంది. ఈ క్రమంలో వేగంగా వచ్చిన కారు ట్రక్కును గమనించకపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసం అయింది. ప్రాణ నష్టం గురించి తెలియరాలేదు. కాగా అక్కడే ఉన్న పోలీసులు ట్రక్కు డ్రైవర్ ను పట్టుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa