భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ).. ప్లేయర్ల సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్ 2025-26ను త్వరలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా ప్లేయర్లకు ప్రమోషన్, డిమోషన్ ఉండనుంది. అలాగే బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌లోకి కొత్త ప్లేయర్లు చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో త్వరలో రిలీజ్ కాబోయే సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్‌లో బీసీసీఐ కీలక మార్పులు చేసినట్లు తెలుస్తోంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిని టాప్ కేటగిరీల నుంచి డిమోట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఇటీవల టీ20 వరల్డ్ కప్ 2026 జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన శుభ్‌మన్ గిల్‌కు బోర్డు గుడ్‌న్యూస్ చెప్పినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి.. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌లో A+ గ్రేడ్‌లో ఉన్నారు. ప్రస్తుతం వీరిని A గ్రేడ్‌కు మార్చనున్నట్లు వార్తలు వస్తున్నాయి. టీ20, టెస్టు క్రికెట్ ఫార్మాట్లకు వీరిద్దరూ వీడ్కోలు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వన్డే ఫార్మాట్‌పైనే దృష్టి సారిస్తున్నారు. ఈ కారణంతోనే వీరి గ్రేడ్ తగ్గించినట్లు తెలుస్తోంది. కాగా, మూడూ ఫార్మాట్లలో యాక్టివ్‌గా ఉన్నప్లేయర్లకు మాత్రమే A+ గ్రేడ్ ఇస్తారు.
గిల్‌కు గుడ్‌న్యూస్..
కాగా, భారత వన్డే, టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ప్రమోషన్‌కు సిద్ధమైనట్లు సమాచారం. ఈ మేరకు అతడిని ‘A’ గ్రేడ్ నుంచి ‘A+’ గ్రేడ్ అప్‌గ్రేడ్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ టాప్ గ్రేడ్‌లో గిల్‌తో పాటు రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా ఉండనున్నట్లు సమాచారం. కాగా, ఇటీవల సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT) అదరొగట్టిన ఇషాన్ కిషన్‌కు ప్రొమోషన్ దక్కినట్లు తెలుస్తోంది. ఇతడిని B గ్రేడ్‌లోకి ప్రమోట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇటీవల ప్రకటించిన టీ20 వరల్డ్ కప్ 2026 స్క్వాడ్‌లో గిల్‌ను పక్కనపెట్టి ఇషాన్ కిషన్, సంజు శాంసన్‌ను జట్టులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్‌పై బీసీసీఐ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. అనంతరం వీరిద్దరినీ సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి బీసీసీఐ తొలగించింది. అయికే గతేడాది శ్రేయస్ అయ్యర్ సెంట్రల్ కాంట్రాక్ట్‌లోకి (గ్రేడ్ బీ) వచ్చాడు. కానీ ఇషాన్ కిషన్‌ను గ్రేడ్ సీలోకి తీసుకున్నారు.
బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా 2024-2025..
గ్రేడ్ A+: విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా
గ్రేడ్ A: రిషబ్ పంత్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, KL రాహుల్, శుభమన్ గిల్, హార్దిక్ పాండ్య
గ్రేడ్ B: సూర్యకుమార్ యాదవ్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, శ్రేయాస్ అయ్యర్, యశస్వి జైస్వాల్
గ్రేడ్ సి: రింకూ సింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, ముఖేష్ కుమార్, సంజు శాంసన్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, రజత్ పాటిదార్, ధ్రువ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్, నితీష్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, అభిషేక్ రాశి వరుణ్, అభిషేక్ దీప్వర్త్ శర్మ
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa