బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతి పట్ల భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ తొలి మహిళా ప్రధానిగా ఆమె సృష్టించిన చరిత్రను గుర్తుచేసుకుంటూ, ఎక్స్ వేదికగా నివాళులర్పించారు. "బంగ్లాదేశ్ అభివృద్ధిలో, అలాగే భారత్-బంగ్లాదేశ్ సంబంధాలను బలోపేతం చేయడంలో ఆమె కీలక పాత్ర పోషించారు" అని మోదీ పేర్కొన్నారు. 2015లో ఢాకా పర్యటన సందర్భంగా ఆమెతో జరిగిన భేటీని మోదీ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa