ఏపీ గ్రూప్-2 పరీక్షల రిజర్వేషన్లపై దాఖలైన అన్ని పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. రిజర్వేషన్ పాయింట్లను సవాలు చేస్తూ అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్లను న్యాయస్థానం విచారించింది. 2023 గ్రూప్-2 నోటిఫికేషన్‌ను రద్దు చేసి, సుప్రీం కోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా రిజర్వేషన్ రోస్టర్ పాటించాలని, పాత నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని అభ్యర్థులు కోరారు. అయితే, న్యాయస్థానం ఈ పిటిషన్లను కొట్టివేస్తూ నిర్ణయం తీసుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa