AP: రాష్ట్రవ్యాప్తంగా జనవరి 2 నుంచి 9వ తేదీ వరకు 21.80 లక్షల పట్టాదారు పాసు పుస్తకాలను రైతులకు పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ రాజముద్రతో కొత్తగా ముద్రించిన ఈ పాసు పుస్తకాలను అందించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఏవైనా తప్పులుంటే సరిదిద్దుకునే అవకాశం కల్పించనున్నారు. రెవెన్యూ గ్రామసభల ద్వారా ఈ పంపిణీ జరగనుంది. ఇటీవల కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు ఈ తేదీలను ఖరారు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa