నూతన సంవత్సర శుభ సందర్భంగా, లీగల్ సెల్ న్యాయవాదులు కనీసవేతనం బోర్డు చైర్మన్, టీడీపీ సీనియర్ నాయకులు పెళ్లకూరు శ్రీనివాసులు రెడ్డిని నెల్లూరులో మర్యాదపూర్వకంగా కలిశారు. నెల్లూరు జిల్లా గవర్నమెంట్ ప్లీడర్ పుచ్చలపల్లి గీతావాణి ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీలో, శ్రీనివాసులు రెడ్డి న్యాయవాదులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి, వారితో ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో స్వర్ణ దీక్షత్, చుండూరి గుణ సాగర్, మోబీనా, రచనా, పరుసు కుమార్ రాజా, జకీర్, రోషన్, వినీష్, రవి తదితర న్యాయవాదులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa