AP: తిరుమల పవిత్రతను కాపాడేందుకు భక్తుల సహకారం అవసరమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. వైకుంఠ ఏకాదశిని అద్భుతంగా నిర్వహించిన టీటీడీని అభినందించారు. డిసెంబర్ 30 నుండి జనవరి 8 వరకు 7.83 లక్షల మందికి వెంకటేశ్వరుడి దర్శన భాగ్యం కల్పించడంపై హర్షం వ్యక్తం చేశారు. 97% మంది సామాన్యులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించడం అభినందనీయమని తెలిపారు. క్యూలైన్లు, ప్రసాదం పంపిణీ వంటి విధానాలు సత్ఫలితాలనిచ్చాయని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa