నీరు-చెట్టు పథకం బిల్లులన్నీ చెల్లించేశామని ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ చెప్పారు. ప్రస్తుతం తమశాఖ వద్ద ఆ బిల్లులేవీ పెండింగ్లో లేవన్నారు. ఈ అంశంపై ఆదివారం సంబంధిత శాఖలతో సమీక్షా సమావేశం నిర్వహించినట్టు తెలిపారు. ఇప్పటివరకు రూ.800 కోట్ల నీరు-చెట్టు బిల్లులు చెల్లించామని, ఇంకా రూ.40 కోట్ల బిల్లులు జలవనరుల శాఖ వద్ద పెండింగ్లో ఉన్నట్టు తెలిపారు. జీఎస్టీ నెంబర్ లేకుండా ఉన్న బిల్లులపై ఎలా ముందుకెళ్లాలనే అంశంపై అధికారులు దిశానిర్దేశం చేస్తారన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa