ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్ అతడిని తప్పకుండా ఆడించాలి: మైకెల్ వాన్‌

sports |  Suryaa Desk  | Published : Thu, Mar 05, 2026, 10:30 PM

టీ20 ప్రపంచకప్ 2026లో కీలక సమరానికి వేళైంది. గురువారం రాత్రి భారత్, ఇంగ్లాండ్ మధ్య రెండో సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ముంబైలోని వాంఖడే క్రికెట్ స్టేడియంలో భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు జరగనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా తుది జట్టు గురించి ఇంగ్లాండ్ మాజీ క్రికెట్ మైకెల్ వాన్‌.. కీలక వ్యాఖ్యలు చేశాడు. వాంఖడేలో భారత్.. కుల్‌దీప్ యాదవ్‌ను తుది జట్టులోకి తీసుకోవాలని సూచించాడు.


“నేనైతే ఇంగ్లాండ్‌తో జరిగే సెమీఫైనల్ మ్యాచ్‌లో కుల్‌దీప్‌ యాదవ్‌ను ఆడిస్తాను. అతడి బౌలింగ్‌లో ఆడటానికి ఇంగ్లాండ్‌ బ్యాటర్లు ఇబ్బంది పడుతుంటారు. లోయర్‌ ఆర్డర్‌లో తిలక్‌ వర్మ, శివమ్‌ దూబెను ఆడించడం అవసరమా? ఆ ఇద్దరిలో ఒకరికి బదులుగా.. కుల్‌దీప్ యాదవ్‌ను భారత్ తుది జట్టులోకి తీసుకోవాలి. అయితే ఈ టోర్నీలో అతడికి ఇప్పటివరకు పెద్దగా అవకాశాలు రాలేదు. మరి ప్రస్తుతం అతడు ఫామ్‌లో ఉన్నాడా? లేదో నాకు తెలియదు. కానీ ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో అతడిని ఆడిస్తే బాగుంటుంది” అని మైకెల్ వాన్ వ్యాఖ్యానించాడు.


ఇక ఇదే సమయంలో టీమిండియా హెడ్‌కోచ్‌గా గౌతమ్ గంభీర్.. వ్యూహాల గురించి సైతం వాన్ మాట్లాడాడు. “గంభీర్‌ తుది జట్టులో ఎక్కువగా బ్యాటర్లకు ప్రాధాన్యం ఇస్తాడు. ముఖ్యంగా టీ20ల్లో 7, 8, 9 స్థానాల వరకు బ్యాటర్లు ఉండేలా చూసుకుంటాడు. కాబట్టి కుల్‌దీప్‌ను ఆడిస్తారని నేను అనుకోవడం లేదు,” అని మైకెల్ వాన్ అభిప్రాయపడ్డాడు.


ఇక ఇప్పటికే టీ20 ప్రపంచకప్ 2026లో న్యూజిలాండ్ ఫైనల్ చేరింది. బుధవారం ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. ఫిన్ అలెన్ విధ్వంసంతో 170 పరుగుల లక్ష్యాన్ని 12.5 ఓవర్లలోనే ఛేదించింది. భారత్, ఇంగ్లాండ్‌ మ్యాచ్‌లో గెలిచే జట్టు మార్చి 8న న్యూజిలాండ్ ఫైనల్‌లో తలపడనుంది.


ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌ కోసం టీమిండియా తుది జట్టు అంచనా..


అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్‌), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్, జస్‌ప్రీత్‌ బుమ్రా, వరుణ్ చక్రవర్తి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa