దేశంలోనే అత్యంత పొడవైన 594 కిలోమీటర్ల గంగా ఎక్స్‌ప్రెస్‌వే ఫిబ్రవరిలో ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీరట్ నుంచి ప్రయాగ్‌రాజ్ వరకు 12 జిల్లాలను కలుపుతూ నిర్మించిన ఈ ఎక్స్‌ప్రెస్‌వే ప్రయాణ సమయాన్ని 12-13 గంటల నుంచి 6-8 గంటలకు తగ్గిస్తుంది. ఇటీవల బదౌన్ జిల్లాలో ఫాస్టాగ్ టోల్ సిస్టమ్ ట్రయల్ రన్ విజయవంతమైంది. ఈ ప్రాజెక్టులో 14 మేజర్ వంతెనలు, 28 ఫ్లై ఓవర్లు, 50 అండర్‌పాస్‌లు ఉన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa