అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్లిన భారతీయ విద్యార్థులు ప్రస్తుతం కఠినమైన ఇమ్మిగ్రేషన్ నిబంధనలను ఎదుర్కొంటున్నారు. ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్‌మెంట్ (ఐసీఈ) అధికారులు వీసా నిబంధనలు ఉల్లంఘించి, క్యాంపస్ వెలుపల అనధికారికంగా పార్ట్-టైం ఉద్యోగాలు చేస్తున్న విద్యార్థులపై నిఘా పెంచారు. F-1 వీసాపై అమెరికాకు వచ్చే విద్యార్థులు కేవలం తమ విద్యాలయ ప్రాంగణంలోనే, వారానికి గరిష్టంగా 20 గంటలు మాత్రమే పని చేయాలి. యూనివర్సిటీ వెలుపల రెస్టారెంట్లు, గ్యాస్ స్టేషన్లు, గ్రాసరీ స్టోర్లలో నగదు ప్రాతిపదికన పనిచేయడం చట్టవిరుద్ధం. ఐసీఈ అధికారులు ఈ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి, పనిచేస్తున్న వారి ఐడీ కార్డులు, పని పత్రాలను తనిఖీ చేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో చాలా మంది విద్యార్థులు భయాందోళనతో ఉద్యోగాలను వదిలివేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa