ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టాస్ వేళ షేక్‌హ్యాండ్‌కు నిరాకరించిన భారత కెప్టెన్

sports |  Suryaa Desk  | Published : Sat, Jan 17, 2026, 05:31 PM

జింబాబ్వేలో జరుగుతున్న అండర్-19 ప్రపంచకప్‌లో భారత్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్ టాస్ సందర్భంగా ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. భారత అండర్-19 జట్టు కెప్టెన్ ఆయుష్ మాత్రే, బంగ్లాదేశ్ వైస్ కెప్టెన్ జవాద్ అబ్రార్‌తో కరచాలనం చేయడానికి నిరాకరించాడు. ఇటీవల భారత్, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుల మధ్య పెరిగిన దూరం, టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లను భారత్‌లో ఆడబోమని బంగ్లాదేశ్ బోర్డు చేసిన ప్రకటన నేపథ్యంలో ఈ సంఘటన చోటుచేసుకుందని వార్తలు వస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa