ఛత్తీస్గఢ్లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. బలోడా బజరార్ జిల్లాలోని ఓ ప్రైవేట్ స్టీల్ ఫ్యాక్టరీలో గురువారం జరిగిన పేలుడు ఘటనలో ఆరుగురు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు అనంతరం దట్టంగా పొగలు వ్యాపించడంతో పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు.స్టీల్ ఫ్యాక్టరీలోని బొగ్గు కొలిమి ఒక్కసారిగా పేలడంతో ఈ ప్రమాదం సంభవించినట్టు సమాచారం. ఆ సమయంలో కార్మికులు అక్కడ శుభ్రం చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. పేలుడు ధాటికి వేడి బొగ్గు, దుమ్ము.. కార్మికులపై పడటంతో వారు తీవ్రంగా గాయపడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa