రథసప్తమి రోజున సూర్యభగవానుడు ఏడు గుర్రాల రథంపై దర్శనమిస్తాడని, ఈ పర్వదినాన సూర్యుడిని ఆరాధించడం వల్ల మృత్యుభయం పోయి సూర్యలోక ప్రాప్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు. మాఘమాస శుక్లపక్ష సప్తమి రోజున సూర్యుడు అవతరించాడని, ఆ రోజున నదీ స్నానాలు, సూర్యోపాసనలు, తలమీద ఆకులతో స్నానం, నదీ తీరాలలో దీపారాధన వంటివి చేస్తే అష్ట ఐశ్వర్యాలు, ఆయురారోగ్యాలు కలుగుతాయని విశ్వాసం. రథసప్తమి రోజున ఎరుపు రంగు పూలతో పూజించడం శుభప్రదం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa