ఫ్రాన్స్‌లోని బస్సీ–సెయింట్–జార్జెస్‌లో తొలి సంప్రదాయ హిందూ మందిర నిర్మాణానికి సంబంధించిన చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. భారత్ నుంచి తీసుకువచ్చిన తొలి శిలలు చేరుకోవడంతో, ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు నిర్మాణంలో కీలక దశ ప్రారంభమైంది. భారతీయ సంప్రదాయ శిల్పకళా పద్ధతులతో, తరతరాలుగా కొనసాగుతున్న నైపుణ్యంతో తయారైన ఈ శిలలను నిపుణులైన భారత శిల్పులు చేతితో సిద్ధం చేసి, ఫ్రాన్స్‌కు తరలించారు. ఈ మందిర నిర్మాణంలో భారత శిల్పులు, ఫ్రెంచ్ స్టోన్ మేసన్లు కలిసి పనిచేయనున్నారు. ఇది రెండు దేశాల మధ్య సంస్కృతి, విలువలు, జ్ఞానం కలిసే వేదికగా నిలుస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa