హిమాచల్ ప్రదేశ్ లోని భార్మౌర్ లో హృదయాన్ని కదలించే సంఘటన చోటుచేసుకుంది. భారీగా కురుస్తున్న మంచు వల్ల కొండ ప్రాంతాల్లో ఉంటున్న జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర పనిమీద పెంపుడు శునకంతో బయటకు వెళ్లిన ఓ వ్యక్తి చలికి తట్టుకోలేక మధ్యలోనే పడిపోయి కన్నుమూశాడు. యజమాని మృతదేహానికి కాపలాగా ఆ పెంపుడు శునకం అక్కడే ఉండిపోయింది. మంచు కురుస్తున్నా, చలిగాలులు వీస్తున్నా అక్కడి నుంచి అది కదలలేదు.ఆ వ్యక్తిని వెతుక్కుంటూ వెళ్లిన రెస్క్యూ సిబ్బందినీ కొంతసేపటి వరకు దగ్గరకు రానివ్వలేదు. యజమాని పట్ల ఆ మూగజీవానికి ఉన్న ప్రేమ, విశ్వాసం చూసి రెస్క్యూ సిబ్బందితో పాటు స్థానికులు కంటతడి పెట్టారు. నాలుగు రోజుల పాటు తిండి తినకుండా, అత్యంత కఠిన వాతావరణంలోనూ ఆ పిట్ బుల్ తన యజమాని మృతదేహాన్ని వదలకుండా కాపలా కాసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చివరకు రెస్క్యూ సిబ్బంది ఆ శునకాన్ని మచ్చిక చేసుకుని మృతదేహాన్ని తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa