ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బ్లడ్‌ప్రెజర్, కొలెస్ట్రాల్, అధికబరువు తగ్గేందుకు కలోంజిగింజల్ని ఎలా తీసుకోవాలి

Health beauty |  Suryaa Desk  | Published : Wed, Jan 28, 2026, 11:05 PM

​కలోంజి సీడ్స్‌ ఈ మధ్యకాలంలో చాలాపాపులర్ అయ్యాయి. వీటిని బ్రెడ్స్, కూరలు, పచ్చళ్ళలో అనేకరకాలుగా వాడతారు. నీటిలో కలిపి నానబెట్టి తీసుకుంటారు. తేనెతో కలిపి తీసుకుంటారు. అయితే, వీటిని తీసుకోవడం వల్ల బరువు తగ్గడం నుంచి గుండె ఆరోగ్యం షుగర్ కంట్రోల్ అవ్వడం వరకూ ఎన్నో రకాలుగా మేలు చేస్తాయని చెబుతుంటారు. అవన్నీ నిజమేనా కాదా అనే విషయాల గురించి డాక్టర్ సేథి కొన్ని ముఖ్య విషయాల్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసుకున్నారు. ఆయన చెప్పిన వాస్తవాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. అలానే కలోంజి గింజల్ని ఎంత పరిమాణంలో తీసుకోవాలి? ఎలా తీసుకోవాలనే విషయాల గురించి తెలుసుకుందాం.


బ్లడ్ ప్రెజర్ తగ్గుతుంది


కలోంజి సీడ్స్‌ని తీసుకోవడం వల్ల బీపి తగ్గుతుందనే విషయం చెబుతుంటారు. ఈ విషయం నిజమేనని డాక్టర్ కూడా అంగీకరించారు. కలోంజి గింజల్ని తీసుకోవడం వల్ల బ్లడ్ వెజిల్స్ రిలాక్స్ అవుతాయి. సర్క్యూలేషన్ పెరుగుతుంది. ఇన్‌ఫ్లమేషన్ తగ్గుతుంది. తక్కువ పరిమాణంలో తీసుకుంటే హైపర్ టెన్షన్ చాలా వరకూ తగ్గుతుంది. అయితే, మనం హెల్దీ లైఫ్‌స్టైల్ మెంటెయిన్ చేస్తూ వీటిని తీసుకుంటేనే రిజల్ట్ ఉంటుంది.


కొలెస్ట్రాల్ తగ్గడం


కలోంజి సీడ్స్‌ని తీసుకోవడం వల్ల బాడీలోని చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ తగ్గుతాయనే విషయాన్ని కూడా డాక్టర్ అంగీకరించారు. వీటిని తీసుకోవడం వల్ల బాడీలో మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీంతో మొత్తం గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. కాబట్టి, వీటిని హ్యాపీగా తీసుకోవచ్చు.


లివర్, కిడ్నీలను కాపాడడం


అదే విధంగా, ఈ గింజల్ని తీసుకుంటే లివర్, కిడ్నీలు హెల్దీగా ఉంటాయనే విషయం గురించి డాక్టర్ ఇది కొంతవరకూ నిజమే. కానీ, మరిన్ని పరిశోధనలు అవసరమని చెబుతున్నారు. అయితే, వీటిని తీసుకోవడం వల్ల పూర్తిగా కిడ్ని, లివర్ ప్రాబ్లమ్స్‌ని దూరం చేయలేం.


బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గడం


అదే విధంగా, కలోంజి గింజల్ని తీసుకుంటే బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయనే వార్తలు కూడా నిజమేనని చెబుతున్నారు డాక్టర్. ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగ్గా చేసి బ్లడ్ షుగర్ తగ్గేలా చేస్తుంది. వీటిని తీసుకోవడం వల్ల ఫాస్టింగ్ గ్లూకోజ్ తగ్గుతుంది. ఇది టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి వరం.


బరువు తగ్గడం


చాలా మంది కోరుకున్నట్లుగా బరువు తగ్గించడంలో ఈ గింజలు అంత బాగా పనిచేయవు. మనం సరైన లైఫ్‌స్టైల్ ఫాలో అయితేనే రిజల్ట్ ఉంటుంది. అంతేకానీ, వీటిని తీసుకోవడం వల్ల బరువు తగ్గుతుందనడంలో నిజం లేదు. బరువు తగ్గించే ప్రక్రియకి హెల్ప్ చేస్తుంది.


కలోంజి సీడ్స్ తింటే కలిగే లాభాలు, వీటిని ఎలా తీసుకుంటే మంచిదంటే


ఆర్థరైటిస్, కీళ్ళ నొప్పులకి మంచిది


అదే విధంగా ఇందులోని ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కీళ్ళ నొప్పుల్ని, వాపుని తగ్గించడమే కాకుండా, రుమటాయిడ్ ఆర్థరైటిస్ తగ్గించడంలో హెల్ప్ చేస్తాయని కొన్ని ఆధారాలు ఉన్నాయి. అదే విధంగా, ఆస్తమా, అలెర్జీలు ఉన్నవారికి కూడా హెల్ప్ చేస్తాయని చెబుతున్నారు డాక్టర్.


ఎంత పరిమాణంలో తీసుకోవాలి


యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్న ఈ కలోంజి సీడ్స్‌ని ఎక్కువగా తీసుకోవడం అంత మంచిది కాదు. తక్కువ మోతాదులో తీసుకోవాలి. హాఫ్ టీస్పూన్ నుంచి టీస్పూన్ పరిమాణంలో మాత్రమే తీసుకోవాలి.


ఎలా తీసుకోవాలి?


వీటిని నీటిలో నానబెట్టి తీసుకోవచ్చు.


సలాడ్స్‌లో వేసి తినొచ్చు.


కూరలు, మసాలాలు, చారుల్లో వేసుకోవచ్చు.


బేక్ చేసినప్పుడు పైన చల్లి తీసుకోవచ్చు.


శాండ్‌విచ్, టోస్ట్‌పై వేసుకుని తీసుకోవచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa