మాజీ ముఖ్యమంత్రి, వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై జరిగిన హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా కూలిపోయి, ఆంధ్రప్రదేశ్ జంగిల్ రాజ్‌గా మారిపోయిందని వైయస్ జగన్ మండిపడ్డారు. తన దుర్మార్గాలను ప్రశ్నిస్తే హత్యాయత్నాలు, దాడులకు దిగుతున్నారని, తిరుమల లడ్డూ ప్రసాదం పేరుతో చంద్రబాబు చేసిన కుట్ర విఫలమవడంతో భంగపడి వైయస్‌ఆర్‌సీపీ నాయకులపై దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు.తిరుమల లడ్డూ ప్రసాదానికి వాడే నెయ్యిలో జంతు కొవ్వులు కలిశాయంటూ చంద్రబాబు చేసిన ఆరోపణలు NDDB, NDRI వంటి ప్రతిష్ఠాత్మక ల్యాబుల నివేదికలతో పూర్తిగా భగ్నమయ్యాయని వైయస్ జగన్ స్పష్టం చేశారు. కోట్లాదిమంది భక్తుల మనోభావాలను గాయపరచినందుకు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా చంద్రబాబుపై వ్యతిరేకత వెల్లువెత్తుతోందన్నారు. క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితిలో ఉండి కూడా, తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు కొత్త కుట్రలకు పాల్పడుతున్నారని విమర్శించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa