ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోలీసుల సమక్షంలోనే ఇలాంటి దాడులు జరుగుతుంటే, అసలు ప్రజాస్వామ్యం ఉందా లేదా?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Feb 01, 2026, 12:04 PM

గుంటూరు శివారులోని గోరంట్లలో మాజీ మంత్రి అంబటి రాంబాబుపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, రాష్ట్రంలో చంద్రబాబు పాలనలో జంగిల్‌రాజ్‌ కొనసాగుతోందని మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని), వైయ‌స్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి జి.శ్రీకాంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు వారు ఒక సంయుక్త ప్రకటన చేస్తూ.. ఏమన్నారంటే..వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వంపైనా, నాటి సీఎం శ్రీ వైయస్‌ జగన్‌పైనా అసత్య ఆరోపణలు చేస్తూ, చివరకు దేవదేవుడి ప్రసాదం పేరుతో అనైతిక రాజకీయం చేశారు. తిరుమల లడ్డూ తయారీలో వాడిన నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందంటూ, చంద్రబాబు, పవన్‌కళ్యాణ్, లోకేష్‌ చేసిన ఆరోపణలు పచ్చి అబద్దాలని దేశంలోనే ప్రతిష్టాత్మక సంస్థలైన ఎన్‌డీఆర్‌ఐ, ఎన్‌డీడీబీ తేల్చి చెప్పాయి. దీంతో దిక్కు తోచని స్థితిలో, కనీసం పశ్చాతాపం కూడా ప్రకటించకుండా, మళ్లీ అవే అసత్యాలతో ఎదురుదాడి చేస్తున్నారు. ఇంకా మరింత దిగజారి రాష్ట్రంలో పలు చోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. శ్రీ వైయస్‌ జగన్‌తో పాటు, టీటీడీ మాజీ ఛైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి ఫోటోలతో, అవే పచ్చి అబద్ధాలతో నిస్సిగ్గుగా, నిర్లజ్జగా ఫ్లెక్సీలు వేస్తున్నారు. వాటిని మా పార్టీ నాయకులు తొలగిస్తే.. ఫ్లెక్సీలు పెట్టిన వారిపై కాకుండా, మా పార్టీ వారిపై పోలీసులు చర్య తీసుకోవడం అత్యంత హేయం. కాగా, గుంటూరు శివార్లలోని గోరంట్లలో శ్రీ వెంకటేశ్వరస్వామి వారి ఆలయంలో పూజలు చేసిన మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఆ తర్వాత పక్కనే ఉన్న వివాదాస్పద ఫ్లెక్సీ వద్దకు చేరుకోగా, అప్పటికే కర్రలు, రాడ్లతో సిద్ధంగా ఉన్న టీడీపీ గుండాలు ఆయనపై దాడి చేశారు. పోలీసుల సమక్షంలోనే ఇదంతా జరిగింది అని వాపోయారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa