బడ్జెట్–2026 అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక సుంక మార్పులు ప్రకటించారు. దేశీయ తయారీ, ఎగుమతుల ప్రోత్సాహం, మందుల ధరల తగ్గింపే లక్ష్యంగా ఫిబ్రవరి 2 నుంచి కొత్త రేట్లు అమల్లోకి వస్తాయి. 17 క్యాన్సర్ మందులు, అరుదైన వ్యాధుల ఔషధాలు, సోలార్ గ్లాస్ ముడి పదార్థాలు, బ్యాటరీ స్టోరేజ్, అణు విద్యుత్, రక్షణ రంగాల విడిభాగాలపై దిగుమతి సుంకం రద్దు చేశారు. వ్యక్తిగత దిగుమతుల పన్ను 10%కి తగ్గింది. ఇవి ‘మేక్ ఇన్ ఇండియా’కి ఊతమిస్తాయని ప్రభుత్వం తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa