ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జోగి రమేష్ ఇంటిపై జరిగిన దాడిని ఖండించిన పోతిన వెంకటమహేష్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 02, 2026, 11:55 AM

రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని, వెంటనే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించి కేంద్ర బలగాలను ఏపీకి పంపించాలని వైఎస్సార్‌సీపీ గుంటూరు పార్లమెంట్ పరిశీలకుడు పోతిన వెంకటమహేష్ డిమాండ్ చేశారు. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు.అయన మాట్లాడుతూ... రాష్ట్రంలో కాపు, బీసీ నాయకులపై వరుసగా దాడులు జరుగుతున్నాయని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. బీసీ, కాపు నాయకుల ఇళ్లపై నిప్పు పెట్టారనుకుంటున్నారు కానీ, వాస్తవానికి మీరు మీ కుర్చీపై మీరే నిప్పు పెట్టుకుంటున్నారు.భస్మాసురుడు తన నెత్తిపై చేయి పెట్టుకొని ఎలా భస్మం అయ్యాడో, అదే విధంగా అంబటి రాంబాబు, విడదల రజినీ, జోగి రమేష్ ఇళ్లపై దాడులు చేయించి నిప్పు పెట్టించడం ద్వారా చంద్రబాబు తన రాజకీయ భవిష్యత్తునే తగలబెట్టుకుంటున్నారు అని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa