బెంగళూరుకు చెందిన సుధారాణి అనే మహిళ ప్రేమ పేరుతో ముగ్గురు వ్యక్తులను పెళ్లి చేసుకుని, లక్షల రూపాయలు వసూలు చేసి మోసం చేసింది. మొదట వీరేగౌడను వివాహం చేసుకుని ఇద్దరు పిల్లలకు తల్లి అయిన ఆమె, విలాసాలకు అలవాటుపడి భర్తను వదిలేసింది. ఆ తర్వాత డెలివరీ బాయ్ అనంతమూర్తిని పెళ్లి చేసుకుని 20 లక్షలు తీసుకుని పారిపోయింది. తాజాగా కనకపురానికి చెందిన మరో వ్యక్తిని మూడో వివాహం చేసుకున్నట్లు సమాచారం. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa