పాక్ జర్నలిస్ట్‌కు ఆస్ట్రేలియా ఆటగాడు మిచెల్ మార్ష్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. టీ20 వరల్డ్ కప్ లో భారత్ తో మ్యాచ్‌ను పాకిస్తాన్ బహిష్కరించడం వంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి నిరాకరించాడు. ఆ విషయాలు తమకు అనవసరమని, తమ దృష్టి అంతా టీ20 వరల్డ్ కప్‌పైనే ఉందని మార్ష్ స్పష్టం చేశాడు. ఫిబ్రవరి 2న జరిగిన మూడో టీ20 అనంతరం ఈ సంఘటన చోటుచేసుకుంది. వరల్డ్ కప్‌లో తమ జట్టుకు భద్రతపై నమ్మకం ఉందని, ఆస్ట్రేలియా కప్ గెలుస్తుందని మార్ష్ ధీమా వ్యక్తం చేశాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa