ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చంద్రబాబు అరాచకాలు ఢిల్లీలో ఎండగడతాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 03, 2026, 03:00 PM

అంబటి రాంబాబు ఇంటిపై విడతల వారీగా ఐదున్నర గంటల పాటు దాడులకు తెగబడ్డారంటే ఎంత దారుణంగా పోలీసులు వ్యవహరించారో అర్థం అవుతోంది అని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. అయన మాట్లాడుతూ.... మరుసటి రోజే జోగి రమేష్‌ ఇంటిపై దాడికి పాల్పడ్డారు. పోలీసుల సమక్షంలోనే గంటల తరబడి దాడులు జరగడం శృతి మించిన అరాచకాలకు నిదర్శనం. లడ్డూ విషయంలో ప్రజలపై అబద్ధాలు రుద్దడంలో ఫెయిల్‌ కావడంతో, డైవర్షన్‌ కోసం ఇలా అడ్డదారిలో బరి తెగించారు. ఇవన్నీ ఢిల్లీలో ఎండగడతాం. కేంద్ర హోం శాఖ దృష్టికి కూడా తీసుకెళ్తాం. ప్రభుత్వ దుర్మార్గాలపై పార్టీ నాయకులంతా ఒక్కటై పోరాడతారు.విడదల రజిని, బొల్లా బ్రహ్మనాయుడుపై దాడుల ఘటనల్లోనూ పోలీసులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఇవన్నీ కలిపి కోర్టుల్లో దావా వేస్తాం. ఇంకా విషయాన్ని జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్చార్సీ) దృష్టికి కూడా తీసుకెళ్తాం. లడ్డూ విషయంలో చంద్రబాబు క్షమాపణచెప్పే వరకు వదిలిపెట్టేది లేదు. ఫ్లెక్సీలపై పోలీస్‌ స్టేషన్లలో ఫిర్యాదులు మంగళవారం కూడా కొనసాగుతాయి అని తెలిపారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa