పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాల (EV) వైపు మొగ్గు చూపుతున్న వారికి బ్యాటరీ నిర్వహణ కీలకం. ఈవీ బ్యాటరీ జీవితకాలాన్ని పెంచడానికి 20-80 ఛార్జింగ్ నియమాన్ని పాటించాలి. సున్నా లేదా 100% ఛార్జింగ్ చేయకూడదు. ఫాస్ట్ ఛార్జింగ్ బదులు స్లో ఛార్జింగ్ వాడటం, ప్రామాణిక ఛార్జర్‌ను ఉపయోగించడం మంచిది. ఎండలో పార్కింగ్ చేయకుండా, నీడలో ఉంచాలి. ప్రీ-కండిషనింగ్, రీజనరేటివ్ బ్రేకింగ్ వాడాలి. సాఫ్ట్వేర్ అప్డేట్లు, ఓవర్‌లోడ్ చేయకపోవడం కూడా ముఖ్యం. ఇన్సూరెన్స్ పాలసీలో బ్యాటరీ రీప్లేస్మెంట్ కవరేజ్ ఉందో లేదో చూసుకోవాలి. ఆరు నెలలకోసారి వీల్ అలైన్మెంట్, టైర్ల పరిస్థితిని తనిఖీ చేయించుకోవాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa