స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో 200MP కెమెరాల హవా కొనసాగుతోంది. బడ్జెట్ ధరల్లో Redmi Note 15 Pro 5G, Realme 16 Pro 5G ఫోన్లు OIS సపోర్ట్‌తో 200MP కెమెరా, 4K వీడియో రికార్డింగ్, 7000mAh బ్యాటరీతో ఆకట్టుకుంటున్నాయి. స్టైల్, ఫోటోగ్రఫీకి ప్రాధాన్యత ఇచ్చేవారికి Vivo V60e 200MP కెమెరా, 30x జూమ్, AI ఎడిటింగ్‌తో అందుబాటులో ఉంది. ప్రీమియం విభాగంలో Vivo X300 (ZEISS ఆప్టిక్స్), Samsung Galaxy S25 Ultra (8K వీడియో, 3x, 5x ఆప్టికల్ జూమ్) అత్యుత్తమ అనుభూతిని అందిస్తున్నాయి. కొనుగోలు సమయంలో మెగాపిక్సెల్స్‌తో పాటు సెన్సార్ సైజ్, సాఫ్ట్‌వేర్ ఆప్టిమైజేషన్‌ను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు.బడ్జెట్ లో బెస్ట్ 200MP కెమెరా ఫోన్ కావాలంటే ఇది మంచి ఎంపిక. ఈ ఫోన్‌లో OIS సపోర్ట్‌తో కూడిన 200MP మెయిన్ కెమెరా ఉంది. అంతేకాకుండా 8MP అల్ట్రా వైడ్ లెన్స్ కూడా ఇది లభిస్తుంది. ఇది 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ ఉండటం మరో విశేషం. ముందు వైపు 20MP ఫ్రంట్ కెమెరా డైలీ యూజ్, సోషల్ మీడియా కోసం సరిపోయేలా ఉంది. భారత మార్కెట్లో దీని ధర సుమారు రూ.30,000 వద్ద ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa