ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గర్బం దాల్చిన బధిర యువతి.. 17 మందికి డీఎన్ఏ పరీక్షలు

national |  Suryaa Desk  | Published : Thu, Feb 05, 2026, 07:32 PM

మూగ, వినికిడిలోపం ఉన్న ఓ బధిర యువతి.. అనారోగ్యానికి గురికావడంతో ఆమెను నాయినమ్మ ఆసుపత్రికి తీసుకెళ్లింది. తన పొట్టలో ఏదో పాకుతున్నట్టు అనిపిస్తోందని సంజ్ఞల ద్వారా చెప్పింది. దీంతో నాన్నమ్మ ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లడంతో వైద్య పరీక్షల్లో విస్తుపోయే విసయం బయటపడింది. ఆమె ఐదో నెల గర్బవతి అని వైద్యులు తేల్చారు. దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వగా.. కేసు నమోదుచేశారు. ఆమె తండ్రిని విచారించగా.. తన కుమార్తెపై అత్యాచారం జరిగిందన్న విషయం తోసిపుచ్చాడు. బాదితురాలి నుంచి వాంగ్మూలం తీసుకోవడం పోలీసులకు కష్టమైంది. చివరకు డీఎన్ఏ పరీక్షల్లో అసలు నిందితుడు ఆమె తండ్రేనని బయటపడింది. గతేడాది సెప్టెంబరులో ముంబయికి చెందిన బధిర యువతి అత్యాచారం కేసులో తాజాగా కన్నతండ్రే కామంతో కళ్లుమూసుకుపోయి కుమార్తెపై అత్యాచారం చేసినట్టు వెల్లడయ్యింది.


 వివరాల్లోకి వెళ్తే.. పొట్టలో తనకు ఏదో పాకుతున్నట్టు సెప్టెంబరు 25న బాధిత యువతి తన నాయినమ్మ సంజ్ఞల ద్వారా చెప్పడంతో ఆమె ముంబయిలోని కామా అండ్ అల్‌బ్లెస్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు పరీక్షించి, ఆమె ఐదో నెల గర్భవతి అని నిర్దారించారు. దీంతో నాయినమ్మ షాకై.. ఆసుపత్రి వైద్యుల సాయంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు.


యువతి మాట్లాడలేకపోవడం, చెప్పడానికి ఇష్టపడకపోవడంతో పోలీసులు మొదట్లో ఇబ్బంది పడ్డారు. తండ్రిని ప్రశ్నిస్తే, అత్యాచారం జరిగిందన్న విషయాన్ని ఖండించాడు. కూతురు ఎలా గర్భవతి అయ్యిందో చెప్పలేకపోయాడు. ఫిర్యాదు చేయడానికి కూడా నిరాకరించాడు. ఈ కేసు చేధన పోలీసులకు సంక్లిష్టంగా మారింది. కానీ, కౌన్సెలింగ్ తర్వాత బాధిత యువతి ఫిర్యాదు చేయడానికి అంగీకరించింది. ఆమె ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు 17 ఏళ్ల మైనర్ సహా ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఆ ఇద్దరు, తండ్రి సహా 17 మంది అనుమానితుల నుంచి డీఎన్‌ఏ, రక్త నమూనాలను సేకరించి, గర్భస్థ శిశువు డీఎన్‌ఏతో పోల్చి చూశారు.


జనవరి 27న వచ్చిన నివేదికలో తండ్రి డీఎన్‌ఏ మాత్రమే శిశువు డీఎన్‌ఏతో సరిపోలింది. దీంతో తండ్రే నిందితుడని నిర్ధారించారు. గత ఏడాది మార్చి నుంచి సెప్టెంబర్ 21 మధ్య ఈ అత్యాచారం జరిగిందని పోలీసులు తెలిపారు. మరుసటి రోజు అంటే సెప్టెంబర్ 22న కేసు నమోదైంది. ఈ కేసులో మరికొందరి పాత్రపై కూడా విచారణ జరుగుతోంది. మహిళలకు బయటే కాదు ఇంటిలోనే రక్షణ లేకుండా పోతుందనడానికి ఈ ఘటన మరో ఉదాహరణ. మహిళలపై ఘోరాల్లో 40 శాతానికిపైగా ఇంట్లోనూ, తమ కుటుంబసభ్యులు, బంధువులు చేతుల్లో జరుగుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa