అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ బ్యాట్‌తో విధ్వంసం సృష్టించాడు. హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఫైనల్ పోరులో ఈ యువ బ్యాటర్ రికార్డుల మోత మోగించాడు. కేవలం 55 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి, అండర్-19 ప్రపంచకప్ చరిత్రలో రెండో వేగవంతమైన శతకాన్ని నమోదు చేశాడు.ఈ క్రమంలో భారత్ తరఫున అత్యంత వేగంగా సెంచరీ చేసిన ఆటగాడిగా వైభవ్ నిలిచాడు. 2022లో రాజ్ అంగద్ బవా 69 బంతుల్లో నెలకొల్పిన రికార్డును అధిగమించాడు. 14 ఏళ్ల వైభవ్ అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో సెంచరీ చేసిన మూడో భారత ఆటగాడిగా కూడా ఘనత సాధించాడు. ఇక, తన తుపాను ఇన్సింగ్స్‌లో 15 ఫోర్లు, 15 సిక్సర్లు బాదిన వైభవ్.. మొత్తం 80 బంతుల్లో 175 పరుగులతో ఇంగ్లంగ్ బౌలర్లను ఊచకోత కోశాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa