ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆరు రోజులుగా హడలెత్తించిన పెద్దపులిని బంధించిన అధికారులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 06, 2026, 08:33 PM

 తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలంలోని కూర్మాపురంలో ఆరు రోజులుగా స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తున్న పెద్దపులి ఎట్టకేలకు అటవీ సిబ్బందికి చిక్కింది. శుక్రవారం ఉదయం పాడుబడిన ఇంట్లో పులి గాండ్రింపులు వినిపించడంతో అటవీ సిబ్బంది రంగంలోకి దిగారు. మత్తు ఇంజక్షన్ ఇచ్చే ప్రయత్నంలో పులి తప్పించుకొని పొలాల్లోకి వెళ్లింది. సాయంత్రానికి కొత్త చెరువు వద్ద పులిని విజయవంతంగా బంధించారు. పులి చిక్కడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.తూర్పుగోదావరి జిల్లాలో రోజుకో ఊరు తిరిగిన పెద్ద పులి..   రఘునాథపురం, రాజానగరంలో, జి.యర్రంపాలెంలో మూడు ఆవులు, దూడను చంపింది. పులిని బంధించేందుకు ఆరు రోజులుగా అటవీశాఖ అధికారులు తీవ్రంగా శ్రమించారు. పుణె, దిల్లీ నుంచి నిపుణుల బృందం కూడా వచ్చింది. పులి జాడ గుర్తించేందుకు ట్రాప్‌ కెమెరాలు, థర్మల్‌ డ్రోన్లు, ఆధునిక పరికరాలను ఉపయోగించారు. హడలెత్తించిన పెద్దపులి ఎట్టకేలకు చిక్కడంతో జిల్లా వాసులు ఊపిరి పీల్చుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa