మహీంద్రా BE 6 బ్యాటమాన్ ఎడిషన్: మహీంద్రా గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. దేశీ ఆటోమొబైల్ మార్కెట్‌లో టాటాకు గట్టి పోటీ ఇస్తూ, ఈ కంపెనీ తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది.తాజాగా మహీంద్రా ఎలక్ట్రిక్ వెహికల్స్ (EV) పై పూర్తి ఫోకస్ పెట్టింది. దీని భాగంగా గ్లోబల్ జైంట్స్ వార్నర్ బ్రదర్స్ డిస్కవరీతో కలిసి సరికొత్త **‘BE 6 బ్యాటమాన్ స్పెషల్ ఎడిషన్’**ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. హాలీవుడ్ సూపర్ హీరో బ్యాటమాన్ థీమ్‌లో వచ్చిన ఈ కారు ఫస్ట్ లుక్‌లోనే మైండ్ బ్లాక్ చేయగలదు. ఎందుకంటే ఇది కేవలం కారు కాదు, ఒక ఎమోషన్, ఫ్యాన్స్ కోసం ఫిక్స్ అయిపోయింది.ఈ స్పెషల్ ఎడిషన్ క్రేజ్ నిజంగా అద్భుతం. బుకింగ్స్ ఓపెన్ చేసిన 135 సెకన్లలోనే సుమారు రెండు నిమిషాల్లో 999 యూనిట్లు అమ్ముడయ్యాయి! అసలు మహీంద్రా ఈ మోడల్‌ను కేవలం 300 యూనిట్లకు పరిమితం చేయాలనుకున్నప్పటికీ, విపరీతమైన డిమాండ్ చూసి 999కి పెంచింది. అయినా సరే, నిమిషాల్లోనే బుకింగ్స్ ముగియడం ఇండియన్ మార్కెట్‌లో మహీంద్రా క్రేజ్ ఎంత ఉందో చూపిస్తుంది. ఈ రికార్డు బుకింగ్స్ ఇండియన్ ఆటో ఇండస్ట్రీలో సరికొత్త చరిత్ర సృష్టించాయి.కంపెనీ ఈ సక్సెస్‌పై గర్వంగా ఉంది. తమ EV కార్లపై కస్టమర్ల విశ్వాసానికి ఈ బ్యాటమాన్ ఎడిషన్ ఒక స్ఫూర్తిదాయక ఉదాహరణ అని పేర్కొన్నారు. టెక్నాలజీ మాత్రమే కాకుండా, పాప్ కల్చర్‌ను కూడా మిక్స్ చేస్తూ కార్లను తీసుకురావడం వల్ల యూత్ బాగా కనెక్ట్ అవుతున్నారని వారు అభిప్రాయపడ్డారు. ఇండియన్ మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాల యాత్ర మొదలైందని, భవిష్యత్తులో మరిన్ని ఇన్నోవేటివ్ వెహికల్స్ తీసుకురావడానికి ఇది పెద్ద బూస్ట్ అవుతుందని కంపెనీ స్పష్టం చేసింది.డెలివరీల విషయానికి వస్తే, సెప్టెంబర్ 20 (ఇంటర్నేషనల్ బ్యాటమాన్ డే) నాటికి గ్రాండ్‌గా ప్రారంభం కానుంది. ఈ ప్రీమియం ఎడిషన్ ఎక్స్-షోరూమ్ ధర ₹27.79 లక్షలు. మొత్తం మూడు వేరియంట్లలో లభించే ఈ కారు ఫ్యాన్స్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఉంటుంది. బ్యాటమాన్ సినిమాలోని డార్క్ నైట్ స్టైల్‌ను ప్రతిబింబించేలా డిజైన్ చేయబడింది. మహీంద్రా తీసుకున్న ఈ స్టెప్ నిజంగా దేశీ కార్ల స్థాయిని గ్లోబల్ లెవల్‌కి తీసుకెళ్ళింది అని చెప్పవచ్చు.BE 6 బ్యాటమాన్ ఎడిషన్ 79kWh కెపాసిటీ ఉన్న పవర్‌ఫుల్ బ్యాటరీతో వస్తుంది. ఇది 286 bhp పవర్, 380 Nm టార్క్ జెనరేట్ చేస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 500–600 కిలోమీటర్ల ప్రయాణం సాధ్యం. స్పోర్టీ లుక్, ప్రీమియం ఇంటీరియర్‌తో, నడుపుతున్నప్పుడు గోథమ్ సిటీలో బ్యాట్మ్యాన్ నడుపుతున్న బ్యాట్మొబైల్ ఫీల్ అనిపిస్తుంది. మొత్తంగా, మహీంద్రా మరోసారి తన స్టైల్‌తో కస్టమర్ల హృదయాలను గెలుచుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa