కణజాల క్షయం అంటే బాడీలోని ముఖ్య కణజాలాలు కండరాలు, కొవ్వు, ద్రవాలు వ్యాధి కారణంగా క్షీణించడం, డ్రైగా మారడం జరుగుతుంది. దీని వల్ల కీళ్ళు, కండరాలు బలహీనంగా మారి పనిచేసే సామర్థ్యం తగ్గుతుంది. ఇది సాధారణంగా COPD వంటి దీర్ఘకాలిక సమస్యల్లో కనిపిస్తుంది. ఇది ఆరోగ్య సంబంధిత సమస్యగా, లేదా పోషకాహార లోపంగా ఉంటుంది. ఇది మొదట్లో అంత ఇబ్బందిగా ఉండకపోయినా రాన్రాను సమస్యగా మారుతుంది. అలాంటప్పుడు ఏం చేస్తే సమస్య తగ్గుతుందో చెబుతున్నారు డైటీషియన్ మన్‌ప్రీత్.
ఆయుర్వేదిక్‌లో సమస్యకి పరిష్కారం
డైటీషియన్ మన్‌ప్రీత్ ప్రకారం, ఆయుర్వేదంలో ఓ చిట్కా ఉందని, మంచి ఆయిల్‌తో మసాజ్ చేయడం వల్ల కీళ్ళు బలంగా మారడమే కాకుండా వాతం కూడా తగ్గుతుందని చెబుతున్నారు. దీనిని తయారుచేసేందుకు వాడే పదార్థాలన్నీ కూడా మన కిచెన్లోనే ఉన్నాయి. అవేంటి, వాటి వల్ల కలిగే ఉపయోగాలేంటో తెలుసుకోండి.
కావాల్సిన పదార్థాలు
లవంగాలు
దాల్చినచెక్క
వాము
నువ్వుల నూనె
ఏం చేయాలంటే
ఓ గ్లాస్ కంటెయినర్ తీసుకుని అందులో నువ్వులనూనె తప్పా మిగతా పదార్థాలన్నీ వేయాలి. తర్వాత అందులో నువ్వుల నూనెని వేడి చేసి కాస్తా చల్లారక అందులో కలపాలి. అంతే ఈ ఆయిల్‌ని మీరు మసాజ్ చేయడానికి వాడొచ్చు. ఇదో చక్కని బామ్లా పనిచేస్తుంది. రెగ్యులర్‌గా వాడితే మీకే రిజల్ట్ కనిపిస్తుంది. రాత్రి పడుకునే ముందు కనీసం 10 నిమిషాల పాటు మసాజ్ చేయండి. రెగ్యులర్‌గా చేస్తే నొప్పి తగ్గుతుంది.
లవంగాల్లోని గుణాలు
లవంగాలు సాధారణంగా నేచురల్‌గా పెయిన్ రిలీవర్‌గా పనిచేస్తుంది. దీంతో మనం నూనె తయారుచేయడం వల్ల ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. దీని వల్ల కీళ్ళు కూడా బలంగా మారతాయి. కాబట్టి, ఇదో చక్కని పదార్థం కూడా. మనం లవంగాల్ని కేవలం మసాలా, వంట్లోనే కాకుండా ఇలా ఇంటి చిట్కాల్లా చాలా బాగా వాడతాం.
దాల్చినచెక్కలోని గుణాలు
దాల్చిన చెక్కలోని గుణాలు జాయింట్స్‌లో సర్క్యూలేషన్ పెంచేలా చేస్తుంది. అంతేకాకుండా, కోల్డ్నెస్, స్టిఫ్నెస్ తగ్గేలా చేస్తుంది. అంతేకాకుండా, దీనిని వల్ల కీళ్ళు, జాయింట్స్‌లో స్టిఫ్‌గా మారడాన్ని తగ్గిస్తుంది. అందుకే, ఇందులో దాల్చినచెక్కని వాడతాం. మంచి క్వాలిటీ దాల్చిన చెక్కని తీసుకోవాలి.
నల్ల మిరియాలతో బెనిఫిట్స్
నల్ల మిరియాల్లో పెపెరిన్ ఉంటుంది. ఇది వాతం కారణంగా వచ్చే నొప్పి, ఒత్తిడిని తగ్గించడంలో పెపెరిన్ హెల్ప్ చేస్తుంది. కాబట్టి, వీటిని కూడా నూనెలో వాడడం మంచిది. ఇవన్నీ కూడా మన ఇంట్లోని పదార్థాలే అయినప్పటికీ నొప్పుల్ని దూరం చేయడంలో చాలా బాగా పనిచేస్తాయి.
కీళ్ళ సమస్యలకి పరిష్కారం
వాము ఎలా పనిచేస్తుందంటే
వాములో థైమోల్ ఉంటుంది. ఇది ఇన్ఫ్లమేషన్ని తగ్గించి కండరాలు దృఢంగా మారడాన్ని తగ్గిస్తుంది. దీంతో నొప్పులు ఉండవు. కీళ్లు చక్కగా ఫ్లెక్సీబుల్‌గా మారతాయి. దీంతో కదిలినప్పుడు, నడిచినప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు.
మెంతులతో లాభాలు
మెంతుల్లో ఉండే గుణాలు కూడా నొప్పిని తగ్గించడంలో హెల్ప్ చేయడంతో పాటు వీక్ అయిన జాయింట్స్‌ని బలంగా చేయడంలో శక్తిని పెంచడంలో హెల్ప్ చేస్తాయి. కాబట్టి, ఓ టేబుల్ స్పూన్ మెంతుల్ని వాడొచ్చు. మెంతుల్లోని ఎన్నో పోషకాలు చాలా సమస్యల్ని దూరం చేస్తాయి. అలానే కీళ్ళ సమస్యల్ని తగ్గిస్తాయి.
నువ్వుల నూనె ఫైనల్ ఇంగ్రేడియెంట్
నువ్వుల నూనెలో సాధారణంగా వేడి చేసే గుణం ఉంటుంది. దీనిని మనం వాడడం వల్ల జాయింట్స్ నరీష్ అవ్వడమే కాకుండా కీళ్ళు ప్రశాంతంగా మారతాయి. వాతం వల్ల వచ్చే నొప్పుల్ని ఈ నువ్వుల నూనె తగ్గిస్తుంది. కాబట్టి, హ్యాపీగా దీనిని వాడొచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa