మాంసాహార ప్రియులకు మటన్ ఒక ప్రత్యేకమైన ఎంపిక. మటన్ కేవలం రుచిని మాత్రమే కాకుండా, శరీరానికి కావాల్సిన అనేక పోషకాలను కూడా అందిస్తుంది. మటన్ లివర్, మేక కాళ్ళు, మేక తలకాయ, మటన్ బోటీ వంటివి రక్తహీనతను తగ్గించడం, ఎముకలను బలోపేతం చేయడం, జీర్ణవ్యవస్థను మెరుగుపరచడం వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. వారానికి ఒకసారి మటన్‌ను ఆహారంలో భాగంగా చేసుకోవడం మంచిది. అయితే, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు తక్కువగా తీసుకోవడం ఉత్తమం.మటన్‌లోని సహజ కొవ్వులు జీర్ణవ్యవస్థను చురుకుగా పనిచేయించడంలో సహాయపడతాయి. అంతేకాదు, ఇందులో ఉండే జింక్, విటమిన్ B కాంప్లెక్స్ శరీర రోగనిరోధక శక్తిని పెంచుతాయి. తరచూ జలుబు, ఇన్ఫెక్షన్లతో బాధపడేవారు వారానికి ఒకసారి మటన్ తీసుకుంటే శరీర ప్రతిఘటన శక్తి మెరుగుపడుతుంది. అయితే కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారు మితంగా తీసుకోవడం ఉత్తమం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa