ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భగవంతుడిపై దుష్ప్రచారం చేస్తూ, చంద్రబాబు తీవ్ర అపచారం చేస్తున్నారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 10, 2026, 01:34 PM

కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రసాదంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర అపచారం చేశారని మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ మండిపడ్డారు. స్వామివారి ప్రసాదానికి కళంకం ఆపాదించేలా చంద్రబాబు వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. గతంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేస్తే నాయకులు నైతిక బాధ్యత వహించేవారని, కానీ ప్రస్తుత కూటమి నాయకులు మాత్రం ఎదురు దాడులకు దిగుతున్నారని అన్నారు. భక్తులు అత్యంత పవిత్రంగా స్వీకరించే లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు ఘోరమైన ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లడ్డూ తయారీలో ఉపయోగించిన నెయ్యిలో టాయిలెట్లు శుభ్రం చేసే యాసిడ్ వాడారంటూ ఆరోపణలు చేయడం దారుణమని అన్నారు. భగవంతుడి మహిమలను చంద్రబాబు లాంటి వ్యక్తి నిర్ణయించడం సాధ్యం కాదని పేర్కొన్నారు. తిరస్కరించిన నాలుగు ట్యాంకర్ల నెయ్యిని మళ్లీ ఎందుకు వినియోగించారనే అంశంపై కుట్ర కోణం ఉందో ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. వైయ‌స్ జగన్‌మోహన్ రెడ్డిపై తప్పుడు ప్రచారం చేసి రాజకీయ లాభం పొందాలని ప్రయత్నించడం సరికాదని విమర్శించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa