కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దేశంలోని 10 ప్రధాన కార్మిక సంఘాల ఉమ్మడి వేదిక ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. ఈ సమ్మెలో సుమారు 30 కోట్ల మంది కార్మికులు పాల్గొంటారని, దేశవ్యాప్తంగా 600కు పైగా జిల్లాల్లో దీని ప్రభావం ఉంటుందని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలను నిరసిస్తూ ఈ సమ్మె చేపడుతున్నట్లు సంఘాలు ప్రకటించాయి. ముఖ్యంగా, కేంద్రం తీసుకొచ్చిన నాలుగు కొత్త లేబర్ కోడ్లను రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను నిలిపివేయాలని, ఉపాధి హామీ పథకంలో మార్పులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ సమ్మెకు సంయుక్త కిసాన్ మోర్చా సహా పలు రైతు సంఘాలు కూడా మద్దతు ప్రకటించాయి.గతేడాది జూలై 9న జరిగిన సమ్మెలో దాదాపు 25 కోట్ల మంది పాల్గొనగా, ఈసారి అంతకంటే ఎక్కువ ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa