ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయం..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 11, 2026, 07:25 PM

రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో 24 ఎజెండా అంశాలపై సుదీర్ఘ చర్చల అనంతరం కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నంద్యాల జిల్లాలో 250 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు కోసం 1500 ఎకరాల భూమిని ఎన్ఆర్ఈడీసీఏపీకి కేటాయిస్తూ, ప్రతి సంవత్సరం రూ.31 వేలు చెల్లించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. అలాగే, ఏలూరు జిల్లా అగిరిపల్లి మండలం తోటపల్లిలో కంప్రెస్ట్ బయోగ్యాస్ ప్లాంట్‌కు 45.60 ఎకరాల ప్రభుత్వ భూమిని ఎన్ఆర్ఈడీసీఏపీకి కేటాయించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.ఇక భూముల బదిలీకి సంబంధించి చట్ల సవరణ ముసాయిదా బిల్లుకు కేబినెట్ సభ్యులు ఆమోదం తెలిపారు. విశాఖ జిల్లా గాజువాక రెవెన్యూ గ్రామంలో 1000 చదరపు గజాల వరకూ క్రమబద్ధీకరణ దరఖాస్తుల గడువను మరో ఆరు నెలలు పొడిగిస్తూ కేబినెట్ నిర్ణయించింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా అభ్యంతరం లేని ప్రభుత్వం భూముల్లోని నివాసాలను ఆక్రమణల క్రమబద్ధీకరణ దరఖాస్తుల గడువును మరో నాలుగు నెలలు పెంచుతూ ఈ భేటీలో మంత్రులు నిర్ణయం తీసుకున్నారు. ఏపీ ఏఐ లివింగ్ ల్యాబ్స్ కోసం, తిరుపతిలోని ఏపీఎస్డీసీ కోసం డిజాస్టర్ రికవరీ సెంటర్ ఏర్పాటుకు సైతం కేబినెట్ ఆమోదం తెలిపారు. అటు కృష్ణా జిల్లా కీసరలో సర్వే నెం.29/8లోని 3.84 ఎకరాల భూమిని కస్టమ్స్ కమిషనరేట్ కార్యాలయం, నివాస గృహాల నిర్మానికి కోసం ఉపయోగించేందుకు ఇచ్చిన జీవోలో మార్పు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa