ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మ్యాచ్, సూపర్ ఓవర్ రెండూ టై,,,,ఆఖరి బంతికి దక్షిణాఫ్రికా విజయం

sports |  Suryaa Desk  | Published : Wed, Feb 11, 2026, 10:59 PM

ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌ 2026 గ్రూప్ స్టేజ్‌లో సౌతాఫ్రికా - అప్ఘనిస్తాన్ మ్యాచ్ నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగింది. పోటాపోటీగా నువ్వా నేనా అన్నట్టు సాగిన ఈ మ్యాచ్‌లో ఆఖరి ఓవర్‌లో హై డ్రామా కొనసాగింది. రబాడా రెండు నో బాల్స్ వేయడం, ఆ వెంటనే గెలవాల్సిన మ్యాచ్‌లో అప్ఘన్ బ్యాటర్ రనౌట్ కావడంతో మ్యాచ్ టైగా ముగిసింది. ఇక సూపర్ ఓవర్‌ కూడా టైగా ముగియడంతో భారీ హైప్ ఏర్పడింది. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా 187/6 చేయగా.. అప్ఘనిస్తాన్ 187కి ఆలౌట్ అయింది.


సూపర్ ఓవర్‌లో తొలుత బ్యాటింగ్‌కి వచ్చిన అప్ఘనిస్తాన్ జట్టు లుంగీ ఎంగిడీ బౌలింగ్‌ని చీల్చి చెండాడింది. బౌండరీతో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన అజ్మతుల్లా ఒమర్జాయి, రెండో బంతిని సిక్సర్‌గా మలిచాడు. మూడో బంతికి సింగిల్ రాగా.. నాలుగో బంతికి గుర్బాజ్ మరో సింగిల్ తీసి అజ్మతుల్లాకి స్ట్రయికింగ్ ఇచ్చాడు. ఐదో బంతికి అజ్మతుల్లా బౌండరీ బాదగా, ఆఖరి బంతికి ఒక్క పరుగు వచ్చింది. దాంతో మొత్తం 17 పరుగులు రాగా.. అజ్మతుల్లా 16 పరుగులు బాదాడు.


18 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా అదే రేంజ్‌లో ఆడింది. తొలి బంతికి మిల్లర్ సింగిల్ తీయగా.. డివాల్డ్ బ్రెవిస్ రెండో బంతికి సిక్సర్ బాది, మూడో బంతికి అవుటయ్యాడు. క్రీజులోకి వచ్చిన ట్రిస్టన్ స్టబ్స్ నాలుగో బంతిని ఫోర్‌గా మలచగా, ఐదో బంతి డాట్ అయింది.. ఆఖరి బంతికి సిక్సర్ బాదడంతో 17 పరుగులు రాగా.. మళ్లీ మ్యాచ్ టైగా ముగిసింది.


సూపర్ ఓవర్ కూడా టైగా ముగియడంతో అంపైర్లు మళ్లీ సూపర్ ఓవర్‌ పెట్టాల్సి వచ్చింది. ఈ సారి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా జట్టు విధ్వంసం సృష్టించింది. ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్ కలిసి ఏకంగా 23 పరుగులు బాదారు. ఈ ఇద్దరూ మూడు సిక్సర్లు నమోదు చేయడం విశేషం.


అజ్మతుల్లా ఓమర్జాయి సూపర్ ఓవర్ వేయగా స్టబ్స్ తొలి బంతిని సిక్సర్‌గా మలిచాడు, రెండో బంతికి సింగిల్ వచ్చింది. డేవిడ్ మిల్లర్ మూడో బంతికి రెండు పరుగులు తీయగా.. వరుసగా నాలుగు, ఐదు బంతులను సిక్సర్లుగా మలిచాడు. ఆఖరి బంతికి రెండు పరుగులు రాగా మొత్తం 23 పరుగులు వచ్చాయి. స్టబ్స్ 7 పరుగులు చేయగా, మిల్లర్ 16 పరుగులు బాదాడు.


24 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అప్ఘనిస్తాన్ . కేశవ్ మహారాజ్ బౌలింగ్ వేయగా.. నబీ స్ట్రయికింగ్ రావడంతో తొలి బంతి డాట్ అయింది, రెండో బంతికి వికెట్ కోల్పోయాడు. దాంతో ఆఖరి నాలుగు బంతుల్లో నాలుగు సిక్సర్లు కావాల్సిన పరిస్థితి వచ్చింది. గుర్బాజ్ మూడో బంతిని సిక్సర్‌గా మలిచాడు. నాలుగో బంతి కూడా సిక్సర్ వెళ్లింది. మూడో బంతిని కూడా సిక్సర్‌గా మలిచాడు. వరుసగా మూడు సిక్సర్లు బాదడంతో.. ఆఖరి బంతికి ఆరు పరుగులు కావాల్సి వచ్చింది. ఐదో బంతి వైడ్ కాగా.. ఆఖరి బంతికి గుర్బాజ్ అవుటయ్యాడు. దాంతో సౌతాఫ్రికా నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa