అమెరికాలో పోలీస్ అధికారి నిర్లక్ష్యం కారణంగా కర్నూలుకు చెందిన జాహ్నవి కందుల (23) మరణంతో సియాటెల్ సిటీ ఆమె కుటుంబానికి 29 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.262 కోట్లు) పరిహారం చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. 2023 జనవరి 23న 40 kmph జోన్లో జాహ్నవి రోడ్డు దాటుతుండగా పోలీస్ వాహనం ఢీకొట్టింది. అప్పట్లో పోలీస్ అధికారి కెవిన్ డవే “ఆమెకు విలువ లేదు” అని కామెంట్ చేసి వివాదం సృష్టించాడు. ఘటనపై అమెరికాలో విమర్శలు వచ్చాయి. కెవిన్ విధుల నుంచి తొలగించబడ్డాడు.ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాకు చెందిన జాహ్నవి (23) ఉన్నత చదువుల కోసం 2021లో అమెరికా వెళ్లారు. సౌత్లేక్ యూనియన్లోని నార్త్ఈస్ట్రన్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీలో చేరారు. 2023 జనవరి 23న రాత్రి ఆమె రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన పోలీసు పెట్రోలింగ్ వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన జాహ్నవి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదానికి కారణమైన పోలీసు అధికారి కెవిన్ డవే.. జాహ్నవి మృతిపై జోకులు వేయడం అప్పట్లో తీవ్ర వివాదాస్పదమైంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa