ఎల్లో మీడియా కథనాలు కూర్పుగా గవర్నర్ ప్రసంగం ఉందని.., ఎల్లో మీడియాలో వచ్చే కథనాలనే పుస్తకంగా అచ్చేసి ఆయనతో చదివించారేమోనన్న అనుమానం కలుగుతోందని వైయస్ఆర్సీపీ యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ స్పష్టం చేశారు. తాడేపల్లిలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆయన ప్రసంగమంతా చూస్తుంటే భ్రమలు, అబద్ధాలు, కాకి లెక్కలు, నిరాధార ఆరోపణలే కనిపిస్తాయని వివరించారు. ఒక్క మాటలో చెప్పాలంటే బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టిన అట్టర్ ఫ్లాప్ సినిమాకి ప్రెస్మీట్ పెట్టి కలెక్షన్ల వర్షం కురిసిందని చెప్పినట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. విజనరీనని చెప్పుకునే చంద్రబాబు పాలనలో అడుగడుగునా వింత పోకడలే తప్ప విషయం లేదని మండిపడ్డారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని వైయస్ఆర్సీపీ నిలదీస్తుందని ప్రభుత్వం భయపడుతోందని, సభలో ప్రభుత్వ వైఫల్యాలు చర్చకు రాకూడదనే భయంతోనే వైయస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని చెప్పారు. ప్రతిపక్ష హోదా విషయంలో గవర్నర్ చొరవచూపాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. 164 మంది సభ్యులున్న కూటమికి 11 మంది వైయస్ఆర్సీపీ సభ్యులకు సమాధానం చెప్పే దమ్ము లేదా అని ప్రశ్నించారు. ప్రతిపక్ష హోదా ఇస్తే సభకు రావడానికి వైయస్ఆర్సీపీ సిద్ధంగా ఉందని తాటిపర్తి చంద్రశేఖర్ స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa