గుంటూరు-కర్నూలు హైవేపై శావల్యాపురం వద్ద గురువారం వేకువజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మధురవాడ నుంచి శ్రీశైలం మెడికల్ క్యాంపునకు టెంపోలో వెళ్తున్న 17 మంది వైద్య విద్యార్థులు ప్రయాణిస్తుండగా, ముందు వెళ్తున్న లారీని టెంపో బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్‌తో పాటు ఏడుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. బాధితులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa