దేశీయ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం లావా, తక్కువ బడ్జెట్లో 'లావా యువ స్టార్ 3'ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఫోన్ 6.75-అంగుళాల హెచ్డీ ప్లస్ డిస్ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. Unisoc SC9863A ప్రాసెసర్, 4GB RAM, 64GB స్టోరేజ్ (512GB వరకు విస్తరించుకోవచ్చు), ఆండ్రాయిడ్ 15 (గో ఎడిషన్), సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వంటి ఫీచర్లున్నాయి. వెనుక 13MP, ముందు 5MP కెమెరాలు, 5000mAh బ్యాటరీ, 10W ఛార్జింగ్, 3.5mm ఆడియో జాక్ కూడా ఉన్నాయి. ఈ ఫోన్ రూ.7,499 ధరకు ఇండస్ బ్లాక్, సియాచిన్ వైట్ రంగుల్లో మార్చి నెల నుంచి అందుబాటులోకి రానుంది. ఏడాది వారంటీతో పాటు ఉచిత ఎట్-హోమ్ సర్వీస్ కూడా అందిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa