ఫిబ్రవరి 15న పాకిస్తాన్‌పై టీమిండియా సాధించిన అద్భుత విజయంలో కీలక పాత్ర పోషించిన ఇషాన్ కిషన్ ఆస్తుల విలువ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నివేదికల ప్రకారం, ఇషాన్ కిషన్ నికర విలువ సుమారు రూ.63 కోట్లు. క్రికెట్ ఆదాయంతో పాటు, వివిధ బ్రాండ్ల ఎండార్స్‌మెంట్‌ల ద్వారా కూడా అతను సంపాదిస్తున్నాడు. అతని వద్ద మెర్సిడెస్, ఫోర్డ్, BMW వంటి విలాసవంతమైన కార్లు, ఖరీదైన వాచులు, పాట్నాలో విలాసవంతమైన ఇల్లు ఉన్నట్లు తెలుస్తోంది.ఇదిలా ఉంటే క్రికెట్‌లోనే కాకుండా ఇషాన్ కిషన్ తనకున్న ప్రజాదరణతో అనేక పెద్ద బ్రాండ్‌లకు ప్రకటనలు చేసి కూడా బాగా సంపాదిస్తున్నాడు. నివేదికల ప్రకారం.. క్రికెట్ నుండి వచ్చే సంపాదనతో పాటు, ఇషాన్ నాయిస్, SG స్పోర్ట్స్, డ్రీమ్11, స్కెచర్స్, ఒప్పో, ఇతర బ్రాండ్‌ల ఎండార్స్‌మెంట్‌ల ద్వారా సంపాదిస్తున్నాడు. ఇషాన్ కిషన్ ఖరీదైన, విలాసవంతమైన కార్లను ఇష్టపడతాడు. అతని వద్ద మెర్సిడెస్ బెంజ్ GLS 450 AMG లైన్, మెర్సిడెస్ C-క్లాస్, ఫోర్డ్ ముస్తాంగ్, BMW X7తో సహా ఇతర కార్లు ఉన్నాయి. దీంతో పాటు ఇషాన్‌కు లగ్జరీ వాచ్‌లు అంటే కూడా చాలా ఇష్టం. అతని వద్ద రోలెక్స్, ఫ్రాంక్ ముల్లర్ బ్రాండ్ల ఖరీదైన వాచ్‌లు ఉన్నట్లు సమాచారం. అలాగే అతనికి పాట్నాలోని రాజేంద్ర నగర్‌లో ఒక విలాసవంతమైన ఇల్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa