ICC Men's T20 World Cup 2026లో భాగంగా England cricket teamతో జరిగిన మ్యాచ్‌లో Italy national cricket team ఓటమి పాలైనా అద్భుతమైన పోరాటంతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఒక దశలో ఇంగ్లండ్‌కు ఓటమి తప్పదేమో అన్న భావన కలిగేలా మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది.ఇటలీ తరఫున బెన్ మనెంటి (60), గ్రాంట్ స్టీవార్ట్ (45) ధాటిగా ఆడుతూ స్కోర్‌బోర్డును పరుగులు పెట్టించారు. వారి దూకుడుతో టీ20లో మరో సంచలన ఫలితం నమోదవుతుందనే ఆశలు రేగాయి. అయితే కీలక సమయాల్లో ఇంగ్లండ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ వరుస వికెట్లు తీశారు. 203 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇటలీ, 20 ఓవర్లలో 178 పరుగులకు ఆలౌటైంది.ఓపెనర్ జస్టిన్ మోస్కా (43) కూడా మంచి సహకారం అందించాడు. కానీ బెన్ మనెంటి, గ్రాంట్ స్టీవార్ట్ ఔటైన తర్వాత ఇటలీ ఇన్నింగ్స్ క్రమంగా కుదేలైంది. చివరికి ఇంగ్లండ్ 24 పరుగుల తేడాతో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ గెలుపుతో ఇంగ్లండ్ సూపర్ 8 దశకు అర్హత సాధించగా, ఇప్పటికే West Indies cricket team కూడా తదుపరి దశకు దూసుకెళ్లింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa