ఓపిక, ధైర్యం, సహనం.. ఈ మూడు మనిషి జీవితంలో అత్యంత ముఖ్యమైనవి. జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు.. ఈ మూడింటినే ఆయుధాలుగా చేసుకుని వాటితో పోరాటం చేయాల్సి ఉంటుంది. కానీ నేటి యువతరంలోని కొంతమందిలో ఈ మూడూ లోపిస్తున్నాయి. ఫలితంగా కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే అనంతపురం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఫోన్ రీఛార్జికి తల్లిదండ్రులు డబ్బులు ఇవ్వలేదనే కారణంతో.. ఓ 17 ఏళ్ల కుర్రాడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. అనంతపురం జిల్లా డి.హీరేహాల్ మండలంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించి పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..
కల్యం గ్రామానికి చెందిన రామకృష్ణ, లక్ష్మి దంపతులకు నవీన్ అనే 17 ఏళ్ల కొడుకు ఉన్నాడు. నవీన్‌కు మొబైల్ ఫోన్ వ్యసనంగా మారిపోయింది. అయితే ఇటీవల అతని ఫోన్ రీఛార్జి వ్యాలిడిటీ పూర్తయ్యింది. దీంతో ఫోన్ రీఛార్జి కోసం తల్లిదండ్రులను రెండు రోజుల కిందట నవీన్ డబ్బులు కావాలని అడిగాడు. అయితే వారు తర్వాత చూద్దామని సమాధానం చెప్పటంతో.. నవీన్ మనస్తాపానికి గురయ్యాడు. తల్లిదండ్రులు మొబైల్ ఫోన్ రీఛార్జ్ కోసం డబ్బులు ఇవ్వలేదనే మనస్తాపంతో పొలంలోని పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. అయితే ఈలోపే ఈ విషయాన్ని గుర్తించిన నవీన్ తల్లిదండ్రులు.. వెంటనే అతన్ని రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అక్కడి నుంచి మరింత మెరుగైన వైద్యం కోసం బళ్లారి ప్రభుత్వ ఆసుపత్రికి నవీన్‌ను తరలించారు. అయితే వైద్యుల ప్రయత్నాలు ఫలించలేదు. నవీన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రోజు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. నవీన్ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
కడుపునొప్పితో గుంతకల్లులో..
మరోవైపు గుంతకల్లులోనూ ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. గుంతకల్లు పట్టణంలోని కసాపురం రోడ్డులో నివసించే రహ్మాన్ కుమారుడు ఇర్ఫాన్ కడుపునొప్పి కారణంగా బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆదివారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో గడియపెట్టుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. మరోవైపు కుమారుడు మృతిని తట్టుకోలేక రహ్మాన్ దంపతులు భోరున విలపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa