రీసెంట్‌గా రియల్‌మీ పి4 సిరీస్‌లో 10,001mAh బ్యాటరీతో పి4 పవర్ ఫోన్‌ను లాంచ్ చేసిన రియల్‌మీ, ఇప్పుడు అదే సిరీస్‌లో P4 Lite అనే లైట్ వెర్షన్ స్మార్ట్ ఫోన్‌ను కూడా అనౌన్స్ చేసింది. రియల్‌మీ ఈ కొత్త ఫోన్‌ను భారీ బ్యాటరీతో లాంచ్ చేస్తుందని ప్రకటించింది, అలాగే దీని కీలక ఫీచర్లు మరియు స్పెక్స్‌ను కూడా బయటకు వివరించింది.రియల్‌మీ పి4 లైట్ ఫోన్ ఫిబ్రవరి 20, మధ్యాహ్నం 12 గంటలకు ఇండియాలో లాంచ్ చేయనుంది. ఈ లాంచ్ కోసం Flipkart ప్రత్యేక టీజర్ పేజీ ద్వారా టీజింగ్ నిర్వహిస్తోంది, ఇందులో ఫోన్ ముఖ్యమైన ఫీచర్ల వివరాలు అందుబాటులో ఉన్నాయి.P4 Lite ఫీచర్స్లో 7.94mm స్లీక్ డిజైన్, 6300mAh పెద్ద బ్యాటరీతో పవర్‌ఫుల్ లాంగ్-లాస్టింగ్ ఎక్స్‌పీరియన్స్, మిలటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్, IP54 డస్ట్ & స్ప్లాష్ రెసిస్టెన్స్, మరియు స్పీకర్ క్లీనర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఫోన్ 6.74-inch HD స్క్రీన్ 90Hz రిఫ్రెష్ రేట్‌తో, 563 nits పీక్ బ్రైట్నెస్ మరియు వాటర్-ప్రూఫ్ స్మార్ట్ టచ్ ఫీచర్‌ను కలిగి ఉంది.డివైస్ MediaTek Helio G99 చిప్‌సెట్తో లాంచ్ అవుతుంది, ఇది వేగవంతమైన 4G బడ్జెట్ చిప్‌గా నిలుస్తుంది. ఫోన్ 18GB వరకు డైనమిక్ RAM మరియు 128GB స్టోరేజ్ను అందిస్తుంది. కెమెరా సెటప్‌లో 13MP ప్రైమరీ + డెప్త్ సెన్సార్ డ్యూయల్ రియర్ కెమెరా ఉంటుంది, AI ఫీచర్లు ఫోటోలు మరింత ప్రొఫెషనల్‌గా తీయడానికి సహాయపడతాయి. అలాగే, AI నోయిస్ ఫిల్టర్ ఫీచర్ ద్వారా కాలింగ్ అనుభవం మెరుగుపడుతుంది.ఫోన్ 15W ఫాస్ట్ ఛార్జ్, 6W రివర్స్ ఛార్జ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. అదనంగా, 300% హెవీ ఆడియో ఫీచర్ను అందిస్తుంది. ఇది Realme యొక్క లేటెస్ట్ UI పై Android 15 OSతో రన్ అవుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa