2026 ఫిబ్రవరి 17న సూర్యగ్రహణం, మార్చి 3న చంద్రగ్రహణం ఏర్పడనున్నాయి. ఈ రెండు గ్రహణాల మధ్య 15 రోజుల కాలాన్ని జ్యోతిషశాస్త్రం ప్రకారం అశుభకరమైనదిగా, అగ్ని పంచకంగా పరిగణిస్తారు. ఈ సమయంలో రాహు-కేతు ప్రభావం వల్ల వ్యక్తిగత, సామాజిక, ఆర్థిక పరిస్థితులపై ప్రతికూల ప్రభావం పడే అవకాశముందని, అగ్ని ప్రమాదాలు, ఆరోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని జ్యోతిష్యులు హెచ్చరిస్తున్నారు.
గ్రహణ సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలు:
మంత్ర జపం: గ్రహణ సమయంలో దైవ చింతన చేయడం, మంత్రాలు జపించడం వల్ల ప్రతికూల శక్తి నుంచి రక్షణ లభిస్తుందని నమ్ముతారు.
ఆహార నియమం: వండిన ఆహారంపై తులసి ఆకులను వేయడం వల్ల గ్రహణ కిరణాల ప్రభావం పడదు.
స్నాన దానాలు: గ్రహణం ముగిసిన వెంటనే స్నానం చేసి, పేదలకు దానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది.
శుభ కార్యాలు: సూతక కాలం ప్రారంభమైనప్పటి నుంచి గ్రహణం ముగిసే వరకు కొత్త పనులు లేదా శుభ కార్యాలను వాయిదా వేసుకోవడం ఉత్తమం.
గమనిక: ఇది కేవలం సమాచారం మాత్రమే. సంస్థ దీనికి బాధ్యత వహించదు. మీ వ్యక్తిగత జాతకంపై ప్రభావం గురించి తెలుసుకోవడానికి నిపుణులైన జ్యోతిష్యులను సంప్రదించగలరు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa