గుడివాడలోని కృష్ణా జిల్లా సీసీఎస్ పోలీస్ స్టేషన్ గోదాములో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో సీజ్ చేసిన వాహనాలు, మద్యం సీసాలు, స్వాధీనం చేసుకున్న వస్తువులు దగ్ధమయ్యాయి. సీసీఎస్ పీఎస్ భవనం పక్కనే తహసీల్దార్, ట్రెజరీ, ప్రభుత్వ కార్యాలయాలు ఉండటంతో కలకలం రేగింది. డీఎస్పీ ధీరజ్ వినిల్, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై డీఎస్పీ విచారణకు ఆదేశించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa