ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బరాక్ ఒబామా వ్యాఖ్యలపై స్పందించిన ట్రంప్

international |  Suryaa Desk  | Published : Fri, Feb 20, 2026, 01:11 PM

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాపై ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణలు చేశారు. ఒబామా అత్యంత రహస్యమైన వర్గీకృత సమాచారాన్ని బయటపెట్టారని ట్రంప్ ఆరోపించారు. ఏలియన్లు (గ్రహాంతరవాసులు) నిజమేనంటూ ఒబామా ఇటీవల చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ట్రంప్ ఈ విధంగా స్పందించారు.ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో ప్రయాణిస్తున్న ట్రంప్‌ను ఫాక్స్ న్యూస్ రిపోర్టర్ ఒక ప్రశ్న అడిగారు. "బరాక్ ఒబామా ఏలియన్లు నిజమేనన్నారు. భూమిని గ్రహాంతరవాసులు సందర్శించినట్లు మీకేమైనా ఆధారాలు కనిపించాయా?" అని ప్రశ్నించారు. దీనికి ట్రంప్ బదులిస్తూ, "ఆయన వర్గీకృత సమాచారాన్ని బయటపెట్టారు. అలా చేయకూడదు. చాలా పెద్ద తప్పు చేశారు" అని అన్నారు. ఏలియన్లు నిజమా? కాదా? అని పదేపదే అడగ్గా "వాళ్లు నిజమో కాదో నాకు తెలియదు. కానీ ఆయన రహస్య సమాచారాన్ని బయటపెట్టారనే విషయం మాత్రం చెప్పగలను" అని బదులిచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa