దేవరకొండలోని కొండమల్లేపల్లి పట్టణంలో రంజాన్ పండుగ సందర్భంగా మైనార్టీ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన వాలీబాల్ టోర్నమెంట్ను సర్పంచ్ పసునూరి యుగేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యువత క్రీడల్లో రాణించాలని, క్రీడలు మానసిక, శారీరక ఎదుగుదలకు దోహదపడతాయని అన్నారు. మైనార్టీ యూత్ వారికి ఆయన అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సై అజ్మీరా రమేష్, వార్డు సభ్యులు, దాతలు, మైనార్టీ యూత్ ఆర్గనైజర్స్ సభ్యులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa